సైన్యంపై వ్యాఖ్యలు.. ప్రధానిపై కేసు

5 May, 2017 19:48 IST|Sakshi
సైన్యంపై వ్యాఖ్యలు.. ప్రధానిపై కేసు

ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఇష్తియాక్ అహ్మద్ మీర్జా అనే న్యాయవాది ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆయన తనను తాను ఐఎం పాకిస్తాన్ పార్టీ చైర్మన్‌గా పేర్కొన్నారు. అయితే, ప్రధాని మీద నమోదు చేసింది ఎఫ్ఐఆర్ కాదని, స్థానికంగా దాన్ని 'రోజ్‌నామ్చా' అంటారని పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక తెలిపింది.

తనకు వాట్సప్‌లో ఒక వీడియో క్లిప్ వచ్చందని, అందులో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మాట్లాడుతున్నట్లు ఉందని మీర్జా చెప్పారు. ఆయన ప్రజలను రెచ్చగొడుతూ, పైనిక దళాల మీద విద్వేషాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. పీఎంఎల్ ఎన్ పార్టీ అధ్యక్షుడైన నవాజ్ షరీఫ్ మీద కేసు కూడా నమోదుచేయాలని ఆయన కోరారు. తమ పార్టీ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌లో కూడా రిజిస్టర్ అయిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.  మొత్తం 70 ఏళ్ల పాక్ చరిత్రలో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది.

>
మరిన్ని వార్తలు