భారీ బల్లిని మింగుతున్న పైథాన్‌..

22 Jan, 2020 14:41 IST|Sakshi

దిష్టి తగలకుండా సాధారణంగా మనం ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీస్తాం. అయితే ఓ కొండచిలువ ఇంటిపై కప్పు నుంచి తలక్రిందులుగా వేలాడుతూ భారీ బల్లిని మింగుతున్న దృశ్యాన్ని చుశారా. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఈ సంఘటన అస్ట్రేలియాలోని రిటైర్మెంట్‌ విలేజ్‌లో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వివరాలు.. క్వీన్ ల్యాండ్‌లోని జాతీయ పార్క్‌కు సమీపం ఉన్న చర్చ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ కమ్యూనిటి హోమ్‌ టౌన్‌ రిటైర్మెంట్‌ విలేజ్‌లోని ఓ ఇంటి గుమ్మం ముందు కొండ చిలువ నోటితో బల్లిని మింగుతూ తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దీంతో అది చూసిన ఆ ఇంటి యాజమాని ఒక్కసారిగా కంగుతిన్నాడు. 

ఈ భయానక దృశ్యాన్ని సెల్‌ఫోన్‌ చిత్రీకరించి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. ‘ఓ విషరహిత సర్పం తనకిందులుగా వేలాడుతూ బల్లిని ఆహారంగా తీసుకుంటున్న అరుదైన దృశ్యం’ అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు ‘ఎంత.. అద్భుతమైన చిత్రం’, ‘ఈ విలేజ్‌ జాతియ పార్క్‌ను తలపించేలా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ విలేజిలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం కొత్తెమీకాదు. ఇంట్లోని సోఫాలపై, బాల్కానిలో పెంపుడు జంతువుల్లా ఎప్పుడూ మనుషుల మధ్య తిరుగుతున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. కాగా సౌత్‌ ఈస్ట్‌, నార్త్‌ ఆస్ట్రేలియాలో ఇంట్లో బిల్డింగ్‌లపై, చెట్లపై ఇవి ఇలా వేలాడుతూ ఉండటం సర్వసాధారణం.

మరిన్ని వార్తలు