వానలో ‘బ్యాగ'ంటుంది!

11 Jul, 2014 00:58 IST|Sakshi
వానలో ‘బ్యాగ'ంటుంది!

వర్షాకాలం వచ్చింది.. ఆఫీసుకు వెళుతున్నప్పుడో, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడో వాన పడొచ్చు. అందువల్ల ఎప్పుడు బయటకు వెళ్లినా రెయిన్ కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. మన బ్యాక్‌ప్యాక్‌లో దాన్ని పెట్టుకోవడానికి తగినంత స్థలం లేకపోతే.. వాన పడుతున్నా, పడకున్నా ఆ కోట్‌ను వేసుకుని తిరగాల్సిందే. ఇదో పెద్ద సమస్య.

ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఫన్నెల్ ఎజెక్ట్‌వేర్ అనే సంస్థ వినూత్నమైన బ్యాక్‌ప్యాక్‌ను తయారుచేసింది. ఆ బ్యాగ్‌లోనే రెయిన్ కోట్ ఇమిడిపోయి ఉంటుంది. మనం బండిపై వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే.. బ్యాగ్ తీయకుండానే ఆ కోట్ వేసుకోవచ్చు. బ్యాక్‌ప్యాక్ పై భాగంలో ఉండే రెండు స్ట్రాప్స్‌ను పైకి లాగితే అందులోనుంచి రెయిన్ కోట్ బయటకు వస్తుంది. దాన్ని చొక్కా వేసుకున్నట్టుగా ఇలా వేసుకుంటే చాలు.. బావుంది కదూ ?
 

>
మరిన్ని వార్తలు