వ్యాక్సిన్ వ‌చ్చేవ‌ర‌కు ముప్పు త‌ప్ప‌దు

14 Apr, 2020 10:18 IST|Sakshi

క‌రోనా మ‌హ‌మ్మారి 2009లో వ‌ణికించిన‌ ప్ర‌మాద‌కారి స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ప్రాణాంత‌కమని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తుంద‌ని పేర్కొంది. వాక్సిన్‌ అందుబాటులోకి వ‌చ్చేవ‌ర‌కు ఈ వైర‌స్ ముప్పు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఈ వైర‌స్ బారిన ప‌డ్డ అనేక దేశాలు లాక్‌డౌన్ విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధానోమ్ గెబ్రియేసుస్ అన్నారు. ఒక‌వేళ‌ లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించుకుంటే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. కాగా క‌రోనాను నివారించేందుకు 70 వాక్సిన్‌లు అభివృ‌ద్ధి ద‌శ‌లో ఉండ‌గా.. ఇందులో మూడు వ్యాక్సిన్ల‌ను మ‌నుషుల‌పై ప్ర‌యోగించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు పంతొమ్మిది ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా ల‌క్ష మందికి పైగా ప్రాణాలు విడిచారు. (వీధుల్లోనే కరోనా మృతదేహాలు)

మరిన్ని వార్తలు