అమీర్ఖాన్కు నోటీసులు

6 Jun, 2015 13:50 IST|Sakshi
అమీర్ఖాన్కు నోటీసులు

ముంబై:  బాలీవుడ్ హీరో అమీర్ఖాన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. పాపులర్ టీవీ షో సత్యమేవ జయతేలో  జాతీయ చిహ్నాన్ని (లోగో), అందులో సత్యమేవ జయతే అనే భాగాన్ని కేంద్ప్రభుత్వ అనుమతి లేకుండా  సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే ఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.


ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే ఆందోళనకారుడు తన లాయర్ ద్వారా ఈ నోటీసులు పంపించారు. విశేష ప్రజాదరణ పొందిన సత్యమేవ జయతే  కార్యక్రమానికి యాంకర్ కమ్ నిర్మాతగా వ్యవహరించిన అమీర్ఖాన్, ఆయన భార్య, సహనిర్మాత కిరణ్ రావు, దర్శకుడు సత్యజిత్ భక్తల్ ను ఇందులో దోషులుగా పేర్కొన్నారు. జాతీయ చిహ్నాన్ని గానీ,  దాంట్లోని  ఏదైనా భాగాన్నిగానీ, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎవరికీ అధికారం లేదని రాయ్ న్యాయవాది మనోజ్ సింగ్ వాదిస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు.  లేదంటే దీనికి సంబంధించి తన క్లయింటు తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించడానికి అమీర్ ఖాన్, కిరణ్రావు తదితరులెవ్వరూ అందుబాటులో లేరు.