రొమాంటిక్‌ ఆకాష్‌

12 Feb, 2019 00:39 IST|Sakshi

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఆకాష్‌ తాజాగా ‘రొమాంటిక్‌’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. నూతన దర్శకుడు అనిల్‌ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ , పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నా«థ్, చార్మి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది.

సీనియర్‌ నటి రమాప్రభ, హీరో కల్యాణ్‌ రామ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమా తొలి సన్నివేశానికి కల్యాణ్‌ రామ్‌ క్లాప్‌ ఇచ్చారు. రొమాంటిక్‌ బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాష్‌ సరికొత్త లుక్, స్టైలిష్‌గా కనిపించనున్నాడని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ , పూరి కనెక్ట్స్‌ పతాకాలపై రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా