150 మిలియ‌న్ మార్క్‌ దాటిన ‘బుట్ట‌బొమ్మ’

4 May, 2020 10:19 IST|Sakshi

‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్ట‌బొమ్మ పాట విడుదలైన‌ప్ప‌టి నుంచి సెన్సేష‌న్స్‌ క్రియోట్ చేస్తూ కొత్త రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 150 మిలియ‌న్ వ్యూస్ మార్క్‌ని దాటేసింది. అతి త‌క్కువ స‌మ‌యంలో ఈ రికార్డును సంపాదించిన మొద‌టి  సౌత్ ఇండియ‌న్ సాంగ్‌గా అరుదైన ఘ‌న‌త‌ను న‌మోదుచేసింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అంద‌రి నోళ్లలో అల‌వోక‌గా నానుతూ బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంద‌రిచేతా స్టెప్పులేయించింది ఈ పాట‌.  (ఈ క్రేజ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు! )

రామ‌జోగ‌య్య శాస్ర్తి ర‌చించిన ఈ పాట‌కు ఎస్ఎస్‌ థ‌మ‌న్ సంగీతం అందించగా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు.  అల్లు అర్జున్ , పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులు ఎంతో ఆక‌ట్టుకున్నాయి. బుట్ట‌బొమ్మ పాట క్రేజ్ ఇప్ప‌టికీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మొన్న బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి ఈ పాట‌కు చిందులేయ‌గా, తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్న‌ర్ త‌న భార్య‌తో క‌లిసి  సాంగ్‌కు స్టెప్పులేసి బుట్ట‌బుమ్మ పాట స‌రిహ‌ద్దులు దాటేసింది అని నిరూపించారు. బుట్ట‌బొమ్మ పాట‌ ఇంకెన్ని సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మ‌రి.  (వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా