-

హీరోయిన్ అఫిషియల్‌ యాప్

5 Mar, 2017 21:19 IST|Sakshi
హీరోయిన్ అఫిషియల్‌ యాప్

చెన్నై‌: ప్రముఖ హీరోయిన్ ఎమీ జాక్సన్‌ తన అఫిషియల్‌ యాప్‌ను చెన్నైలోని ఓ హోటల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూయార్క్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఎస్కాపెక్స్‌ ఈ యాప్‌ను రూపొందించిందని చెప్పారు. ఈ కొత్త యాప్‌తో అభిమానులు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా తనతో నేరుగా చాట్‌ చేయవచ్చన్నారు. పుష్‌ నోటిఫికేషన్స్, ఫీచర్డ్‌ వీడియోస్, సూపర్‌ఫ్యాన్‌ బ్యాడ్జెస్, సబ్‌స్క్రిప్షన్, లైవ్‌ బ్రాడ్‌కాస్ట్‌ వంటి వినూత్నమైన అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని వివరించారు.

తాను భవిష్యత్తులో మరెన్నో ప్రణాళికలు రూపొందించనున్నానని, ఇవన్నీ అభిమానులు ముందుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. ఈ యాప్‌ ద్వారా సోషల్‌ మీడియా కార్యకలాపాల్లో తనను మరో మెట్టుకు తీసుకువెళ్లినట్టు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు.  డబ్బు సంపాదన కోసం తాను ఈ యాప్ పెట్టలేదని ఎమీ జాక్సన్‌ స్పష్టం చేశారు.