కరోనా: బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఏమన్నారంటే

20 Mar, 2020 15:56 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నేతృత్వంలో బాలీవుడ్‌ తారలంతా కరోనాపై ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు చిరంజీవి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు వంటి వారు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు, సూచనలు తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా అమితాబ్‌, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ కుమార్‌, శిల్పా శెట్టి, మాధురీ దీక్షిత్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ దావన్‌ వంటి వారంతా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నడుం బిగించారు. రోహిత్‌ శెట్టి ప్రొడక్షన్‌ హౌజ్‌ రూపొందించిన ఈ వీడియోలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు.(మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18) 

కోవిడ్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో అందరం ఐక్యంగా ఉంది. ప్రతి జీవితం విలువైనదే అంటూ షేర్‌ చేసిన ఈ  వీడియోలో.. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటం, మాస్క్‌లు ధరించడం, వంటి విషయాలను తెలియజేశారు. ఈ వీడియోను మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రూపొందించారు. అదే విధంగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ సైతం తనదైన శైలిలో మహమ్మారిని ఎదుర్కోవడానికి సూచనలు చేశాడు. గురువారం రాత్రి సోషల్‌ మీడియాలో ఓ వీడియో ద్వారా సామాజిక ఎడం పాటించడమే కరోనా వ్యాప్తికి పరిష్కారమని, ప్రధాని నరేంద్ర మోదీ సలహాలను పాటించాలాని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇక మార్చి 22 ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించిన విషయం తెలిసిందే. దీన్ని బాలీవుడ్‌ ప్రముఖులంతా స్వాగతిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు భారత్‌లో 206 కేసులు నమోదవ్వగా.. తెలంగాణలో 18 కేసులు నమోదయ్యాయి. (సెల్ఫ్‌ క్వారంటైన్‌లో సీనియర్‌ నటి)

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా పాజిటివ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా