ఇలాంటి సినిమా అవసరమా అన్నారు..

24 Mar, 2019 01:48 IST|Sakshi
నిక్కి తంబోలి, ఆదిత్, బాల మురళి, సంతోష్‌ పి. జయకుమార్‌

– ఆదిత్‌  

బ్లూ ఘోస్ట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ శనివారం  జరిగింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంతోశ్‌ పి జయకుమార్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం 2 రోజుల్లోనే దాదాపు 2.5 కోట్ల రూపాయలను రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. దర్శకుడిగా హ్యాపీగా ఉంది. సపోర్ట్‌ చేసిన యూనిట్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు.

హీరో అరుణ్‌ ఆదిత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్‌ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి సమాధానం చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్‌ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. బి, సిలలో ఆడే సినిమా ఇది అన్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి థ్యాంక్స్‌. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్‌ షాట్‌గా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ముందే చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్‌’’ అన్నారు. హీరోయిన్‌ నిక్కి తంబోలి చిత్రవిజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు