దీపిక టిక్‌టాక్‌ ఛాలెంజ్‌.. నెటిజన్లు ఫైర్‌

19 Jan, 2020 16:11 IST|Sakshi

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన ఛపాక్ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేశారు. అయితే ఆ సినిమా ప్రమోషన్‌ కోసం దిపికా చేసిన పనికి సోషల్‌ మీడియా తిట్టిపోస్తోంది. ప్రమోషన్‌ కోసం మరీ ఇంత దిగజారుడు పని చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(చదవండి : ఛపాక్‌ : మూవీ రివ్యూ)

అసలేం జరిగిందంటే.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా దీపికా చాలామంది టిక్ టాక్ స్టార్లను కలిసింది. అందులో ఒకరిని తన సినిమాల్లో గెటప్‌లకు టిక్ టాక్ చేయాలంటూ కోరింది. వాటిలో ఒకటి ఓం శాంతి ఓంలో క్యారెక్టర్, పీకూలో క్యారెక్టర్, మూడోది ఛపాక్ మూవీలో లక్ష్మీ క్యారెక్టర్ చేయమని కోరింది. అవి తన ఫెవరేట్‌ క్యారెక్టర్లు అని కూడా చెప్పింది.  దీపిక విసిరిన చాలెంజ్ ను ఫాబీ అనే  ఓ మేకప్ ఆర్టిస్ట్ తీసుకుంది. 

ఆ గెటప్‌లతో 39  సెంకడ్ల నిడివి గల టిక్ టాక్ వీడియో తీసి పోస్టు చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం దీపికా చీప్ స్టంట్లన్నీ చేస్తుందంటున్నారు. ఛపాక్ లో యాసిడ్ దాడి జరిగిన ముఖంతో టిక్ టాక్ చేయమని చెప్పడం ఏ రకమైన ప్రమోషన్ ఆలోచించావా? ‘ఇది యాసిడ్‌ దాడి బాధితుల్ని కించపరచడమే’, ‘నిన్నుచూస్తే సిగ్గుగా అనిపిస్తోంది’, ‘ఇది సరియైన ప్రమోషన్‌ కాదు. ఆ మూవీ నీ మెకప్‌కు సంబంధించినది కాదు. ఓ యాసిడ్‌ బాధితురాలి  జీవితం. ఇలాంటి ప్రమోషన్‌తో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయావు’ జెఎన్‌యూను సందర్శించడం కూడా ప్రమోషన్‌ కోసమే. యాసిడ్‌ బాధితురాలి మొఖం నీకు ఫెవరేట్‌ ఫేస్‌ ఎలా అవుతుంది. ఇది వారిని అవమానించడమే. మీరు ఏం చేసిన డబ్బు కోసమే చేస్తారు’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా