దియా మిర్జా డెరైక్షన్

2 Dec, 2015 22:57 IST|Sakshi
దియా మిర్జా డెరైక్షన్

ఈ జనరేషన్ హీరోయిన్లు అటు ప్రొడక్షన్‌లోనూ, ఇటు డెరైక్షన్‌లోనూ అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో దియా మిర్జా కూడా చేరారు. హైదరాబాదీ అమ్మాయిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన దియా మిర్జా ఇప్పుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది నిర్మాతగా ‘బాబీ జాసూస్’ అనే చిత్రాన్ని నిర్మించిన దియా,  డైరక్షన్ వైపు దృష్టి సారించారు. ‘‘నాకు మొదటి నుంచి డెరైక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నా. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తా’’ అని చెప్పారు.