‘నేల టికెట్‌’కు ఫిదా టచ్

27 Dec, 2017 13:15 IST|Sakshi

‘రాజా ది గ్రేట్’ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు పనుల్లో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో వెంటనే ‘సొగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 5న సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు.

ఈ సినిమాకు ఓ కొత్త సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. శేఖర్ కమ్ముల దర్శకత‍్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్‌ను ‘నేల టికెట్’ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

మరిన్ని వార్తలు