భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

22 Mar, 2019 10:32 IST|Sakshi

ఫ్రిదాపింటో పిలుపు

కొరుక్కుపేట: భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అని ప్రముఖ నటి, సామాజికవేత్త ఫ్రిదాపింటో పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొంటూ.. రోసాటోమ్‌ స్టేట్‌ అటామిక్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నేతృత్వంలో వాతావరణ మార్పు సమస్యలపై మూడు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించినట్టు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్‌ దేశాల సహజ అవాసాలలో వృక్షజాలం, జంతు జాలంపై దృష్టి సారించి డాక్యుమెంటరీ, పశ్చిమ కనుమలు, తమిళనాడులోని వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, సుందర్బాన్‌ డెల్టా రిమోట్‌ స్థానాల్లో డ్యాక్యూమెంటరీ చిత్రీకరించినట్టు వివరించారు.

ప్రపంచ దేశాలన్నీ భూతాపంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అయితే దానిపై తగిన దృష్టి సారించకపోవడంతో మానవాళికి పెను ప్రమాదంతోపాటు ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. అరుదైన వన్యప్రాణులను కాపాడుకోవాలన్నా, మనవ మనుగడ సాగాలన్న భూతాపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా ప్రతిఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో రొసాటామ్‌ స్టేట్‌ అటామిక్‌ కార్పొరేషన్‌ కృషి హర్షణీయమన్నారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలతోపాటు మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె ప్రకటనలో వెల్లడించారు.  

మరిన్ని వార్తలు