ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి

29 May, 2016 16:47 IST|Sakshi
ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి

ముంబై: విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా 'ది డర్టీ పిక్చర్'కు విమర్శలతో పాటు ప్రశంసలూ వచ్చాయి. ఈ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని విద్యాబాలన్ చెబుతోంది. 8 నుంచి 10 వరకు బయోపిక్స్ ఆఫర్లు వచ్చాయని, వాటిని నిరాకరించినట్టు చెప్పింది. 'ఏక్ అల్బీలా' మరాఠీ సినిమాలో అవకాశం రావడంతో అంగీకరించానంది. ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నటి గీతా బాలి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నిజజీవిత పాత్రలకు తాను సరిపోతానని అంది.

తనకు నటనపై అమితాసక్తి ఉందని, హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితం కావాలని భావించడంలేదని విద్యాబాలన్ చెప్పింది. ముంబైలో పుట్టిపెరిగాను కాబట్టి మరాఠీల సంస్కృతి తెలుసునని, అందుకే మరాఠీ సినిమాలో నటించాలని కోరుకున్నానంది. మలయాళంలోనూ ఓ బయోపిక్లో నటిస్తున్నానని వెల్లడించింది. ఏ భాషలో మంచి పాత్ర లభించినా చేస్తానని చెప్పింది.