హాలీవుడ్ స్టార్ హీరో.. బాలీవుడ్ డ్యాన్స్

5 Apr, 2016 14:06 IST|Sakshi
హాలీవుడ్ స్టార్ హీరో.. బాలీవుడ్ డ్యాన్స్
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్ కొద్ది రోజులు భారత్లో సందడి చేస్తున్నాడు. తన కొత్త సినిమా కుంగ్ ఫూ యోగా కోసం షూటింగ్ షెడ్యూల్స్తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీతో పాటు పలువురు భారతీయ నటులు కూడా కనిపించనున్నారు. ఇందులో భాగంగా తాజా షెడ్యూల్లో జాకీ చాన్, సోనూసూద్లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొరియోగ్రాఫిలో జాకీ చేసిన ఇండియన్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది.
 
ప్రస్తుతం జోద్ పూర్, మండోర్ గార్డెన్స్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలను కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వెల్లడించారు. జాకీచాన్ తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫరా, 'యాక్షన్ కింగ్ డ్యాన్ కూడా చేస్తాడు. తన పేరును జాకీ జాక్సన్గా మార్చుకోనున్నాడు' అంటూ కామెంట్ చేశారు. సోనూ సూద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్స్ అమైరా దస్తర్, దిశ పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా