క్యారెట్‌ కేక్‌ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై

22 Apr, 2020 12:14 IST|Sakshi

ముంబై : లాక్‌డౌన్‌లో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్‌ స్టార్‌  జాన్వీ కపూర్‌ మాస్టర్‌ చెఫ్‌గా మారారు. కిచెన్‌లోకి దూరి కష్టపడి క్యారెట్‌ కేక్‌ తయారు చేశారు.దీనిని ముద్దుల చెల్లెలు ఖుషీకి రుచి చూపించి..ఎలా ఉందో చెప్పాలని కోరారు. అయితే క్యారెట్‌ కేక్‌ను టెస్ట్‌ చేసిన ఖుషీ మాత్రం ఊహించని రిప్లై ఇచ్చారు. ముందుగా కొద్దిగా తిన్న ఖుషీ బాగుందని కితాబు ఇచ్చింది. మరికొంత తినమని జాన్వీ అడగడంతో.. ఖుషీ అందుకు నిరాకరించి నాకు అది నచ్చలేదు అని సమాధానమిచ్చారు. ఈ వీడియోను మొదటి జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేయగా అనంతరం ఆమె ఫ్యాన్స్‌ క్లబ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (‘పుష్ప’ సర్‌ప్రైజ్‌: బన్నీకి లవర్‌గా నివేదా)

ఇంతకముందు జాన్వీ లాక్‌డౌన్‌ కాలం తనను మార్చిన విధానాన్ని ఓ వివరణాత్మక పోస్ట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ పుణ్యామా అని సెలబ్రిటీలంతా తమలో ఉన్న నైపుణ్యాలను బయటపెడుతున్నారు. దీపికా పదుకొనే నుంచి కత్రినా కైఫ్‌ వరకు కొత్త కొత్త వంటలు సృష్టించడంలో బిజీగా ఉన్నారు. నలభీముడిలా మారిపోయి గరిట తిప్పుతున్నారు. కాగా ఈ వంటకాలను చూసిన అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. తాము ఆరాధించే తారలు యాక్టింగ్‌ మాత్రమే కాకుండా.. ఇంటి పనులు కూడా చకాచకా చేయగలరని అభిప్రాయపడుతున్నారు. (ఎక్కడైనా నేర్చుకోవచ్చు: జాన్వీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు