గరిటె తిప్పుతున్న బోనీకపూర్‌.. వెనుక జాన్వీ..

13 Nov, 2019 13:04 IST|Sakshi
జాన్వీ షేర్‌ చేసిన ఫొటోలు

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌కు తన తండ్రి, బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ అంటే ఎనలేని ప్రేమ. తండ్రే తన బలమని చెప్తుంది జాన్వీ. అయితే నాన్నకూచి అయిన జాన్వీ బోనీని ఎంతగానో మిస్‌ అవుతుందట. ఈ మేరకు కొన్ని అందమైన జ్ఞాపకాలను మిగిల్చిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో భాగంగా.. నటనలో శిక్షణ తీసుకుంటున్న మూడో కుమార్తె ఖుషీతో కలిసి బోనీకపూర్‌ న్యూయార్క్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ అక్కడ సరదాగా ఎంజాయ్‌ చేస్తూ దిగిన ఫొటోలను జాన్వీ అభిమానులతో పంచుకుంది. నాన్న పక్కన తను లేనన్న బాధతో మిస్‌ అవుతున్నానంటూ క్యాప్షన్‌ జోడించింంది.


దీంతోపాటు చంఢీఘడ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి పంజాబీ ఆహారాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను పంచుకుంది. అన్నింటికన్నా మించి తండ్రితో కలిసి దిగిన చిన్ననాటి ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో తండ్రి బోనీకపూర్‌ వంటగదిలో గరిటె తిప్పుతుంటే వెనక నుంచి జాన్వీ, ఖుషీ, వీరి స్నేహితురాలు అతన్ని హత్తుకున్నారు. ఈ ఫొటో చూసినవారంతా వారి మధ్య ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. కాగా సోమవారం 64వ పడిలోకి అడుగుపెట్టిన తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ధడక్‌ సినిమాతో తెరంగ్రేటం చేసిన జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’ షూటింగ్‌లో బిజీగా ఉంది. (చదవండి: తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

సినిమా

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి