జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోటో

22 Jul, 2015 12:34 IST|Sakshi
జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోటో

హైదరాబాద్: తన కుమారుడు అభయ్ రామ్ తొలి పుట్టినరోజు కోసం హీరో ఎన్టీఆర్ మంగళవారం యూరప్ నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చారు. బుధవారం(జూలై 22) అభయ్ రామ్ పుట్టినరోజు కావడంతో నందమూరి వారింట సందడి నెలకొంది. అభయ్ రామ్ బర్త్ డే పార్టీని ఘనంగా నిర్వహించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

కాగా తన కుమారుడితో ఎన్టీఆర్ కలిసివున్న ఫోటో 'సాక్షి' సంపాదించింది. పుత్రోత్సాహంతో అభయ్ రామ్ ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకుంటున్న ఫోటో అభిమానులకు కనువిందు చేయనుంది. తన పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడి ఫోటో తొలిసారిగా మే 19న జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమే ఎన్టీఆర్ యూరప్ వెళ్లారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. పొడవాటి గడ్డం, వెరైటీ కటింగ్ తో విభిన్నంగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే బయటకు వచ్చిన ఎన్టీఆర్ కొత్త గెటప్ ఫోటోలు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి