రవితేజ సినిమాలో కాజల్‌ కూడా..!

31 Jan, 2018 15:12 IST|Sakshi
కాజల్ అగర్వాల్‌, రవితేజ

ఈ శుక్రవారం ‘టచ్‌ చేసి చూడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ, వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేల టికట్‌ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ మాస్‌ హీరో తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం తెరకెక్కనుందని ప్రకటించారు రవితేజ.

అమర్‌ అక్బర్‌ ఆంటోని అనే క్లాసిక్‌ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా నివేథ థామస్‌ను ఫైనల్‌ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ పేరును పరిశీలిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా విశేషాలు తర్వలో దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు