‘విజేత’కు క్లీన్‌ యూ

7 Jul, 2018 08:38 IST|Sakshi

చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నాటి సూపర్‌ హిట్‌ మూవీ ‘విజేత’ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య జరిగే సన్నివేశాలే హైలెట్‌గా నిలవనున్నాయి. 

విజేత ట్రైలర్‌, సాంగ్స్‌కు సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్‌ శశి దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా