అందుకే నచ్చావ్‌..

6 Dec, 2017 11:46 IST|Sakshi

సాక్షి,పాట్నా: బీజేపీ అగ్రనాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించే ఎంపీ, నటుడు శత్రుజ్ఞ సిన్హా వివాదాస్పద చిత్రం పద్మావతి విషయంలో మాత్రం పార్టీ వైఖరినే అనుసరించారు. పద్మావతి మూవీని వ్యతిరేకించడంతో రాజ్‌పుట్‌ కర్ణిసేన ఆయనను ఘనంగా సన్మానించింది. దీపికా పదుకోన్‌, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌లు నటించిన వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావతిని వ్యతిరేకించిన శత్రుజ్ఞ సిన్హాకు రాజ్‌పుట్‌ కర్ణిసేన బీహార్‌ శాఖ రాణి పద్మిని చిత్రపటం బహుకరించి సముచితంగా సత్కరించింది.

ఓవైపు పద్మావతి వివాదంపై బాలీవుడ్‌ అంతా దర్శకుడు భన్సాలీ వైపు నిలవగా, చిత్రపరిశ్రమకు చెందిన సిన్హా భిన్నమైన వైఖరి తీసుకుని చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలపై పద్మావతిని వ్యతిరేకించారు.

ఇప్పటికే రాజస్ధాన్‌, యూపీ, గుజరాత్‌ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.మరోవైపు సినిమాలో మార్పులు చేసినా తాము పద్మావతి విడుదలకు అంగీకరించబోమని రాజ్‌పుట్‌ సంఘాలు హెచ్చరించాయి.

మరిన్ని వార్తలు