‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’

8 Nov, 2019 17:50 IST|Sakshi

‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్‌ స్టేటస్‌, కాలర్‌ ట్యూన్‌, రింగ్‌ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ ఈ పాటకు ట్యూన్‌ కట్టగా.. చంద్రబోస్‌ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్‌ సమీ వాయిస్‌ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్‌’ సినిమాలోని మరో లిరికల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ తాజాగా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చంద్రబోస్‌ అందించిన హార్ట్‌ టచింగ్‌ లిరిక్స్‌తో పాటు అద్నాన్‌ సమీ వాయిస్‌ ఎక్స్‌ట్రార్డినరీగా నిలిచింది. ఇక  జానీ మాస్టర్‌ స్టెప్స్‌ కంపోజ్‌ కూడా కొత్తగా ఉంది. ఓవరాల్‌గా అన్ని హంగులు జోడించి విడుదల చేసిన ఈ లిరికల్‌ సాంగ్‌ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి కథానాయికగా కనిపించనుంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు.  వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్‌ తదితరులు నటించారు. 


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌పై నారాయణమూర్తి ప్రశంసలు

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?

తిప్పరా మీసం : మూవీ రివ్యూ

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా

నిరంతర యుద్ధం

సారీ..!

రెండు ఊళ్ల గొడవ

అమలా పూల్‌

హారర్‌ బ్రదర్స్‌ బయోపిక్‌

కమల్ @ 65

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ