కాటమరాయుడు సెకండ్ సాంగ్..

9 Mar, 2017 16:40 IST|Sakshi
కాటమరాయుడు సెకండ్ సాంగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించకుండా.. ఒక్కో పాటను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో రెండో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మూవీ టీం మాత్రం ఓ రొమాంటిక్ డ్యూయెట్ తో అభిమానులను అలరించింది.

లాగే మనుసు లాగే నీ వైపే నను లాగే అంటూ సాగే ఈ పాటకు భాస్కరబట్ల సాహిత్యం అందించగా నకాష్ అజీజ్, ధనుంజయ్, నూతనలు ఆలపించారు. తొలి పాటతో మాస్ ఆడియన్స్ ను ఊర్రూతలూగించిన కాటమరాయుడు టీం రెండో పాటతో క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. మార్చి 18న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.