'కిక్-2లో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అట'

21 Aug, 2015 14:16 IST|Sakshi
'కిక్-2లో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అట'

హైదరాబాద్: కిక్  సినిమాతో  తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ... రెండోసారి  ఆ కంఫర్ట్ మజాను అందించడానికి రెడీ అయ్యాడు. కిక్ సినిమా సీక్వెల్గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన వాళ్లు కథ బాగుందని ముఖ్యంగా బ్రాహ్మనందంతో కామెడీ హైలైట్ అంటున్నారు. సినిమాలో పాటలు అద్బుతంగా ఉన్నాయంటున్నారు.

మరోవైపు మంచి కథతో రచయితలు ముందుకు వస్తే  కిక్-3  తీయడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో రవితేజ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'వ్యాపారం కోసం కాదు...నిజంగానే చక్కటి కథ, మంచి టీమ్తో ఎవరైనా తనను సంప్రదిస్తే'  కిక్ సీక్వెల్ లో నటిస్తానని మాస్ మహారాజ స్పష్టం చేశాడు. కిక్ 3 చేయడానికి  తనకు చాలా  ఉత్సాహంగా ఉందన్నాడు.  కిక్ 3 సినిమా తీస్తే  వ్యాపార విస్తరణకు అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నాడు.  ఆసక్తికరమైన కథనంతో పాటు మంచి టెక్నికల్ టీమ్  కూడా కావాలని రవితేజ అభిప్రాయపడ్డాడు. తెలుగులో కిక్ సినిమా అందించిన విజయోత్సాహంతో  దూసుకుపోతున్న ఈ మాస్ మహారాజా ఆ మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరని చెప్పకనే చెబుతున్నాడు.