క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!

9 Apr, 2020 11:17 IST|Sakshi

ఏడాది క్రితం ఇండియాలో మొదలైన మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఎంతో మంది మహిళలు ఇంకా ఇలాంటి అమానుషాన్నిఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు బాలీవుట్‌ నటి మాన్వీ గాగ్రీ. ధూమ్‌ మచావో ధూమ్‌ టెలివిజన్‌ షోతో కెరీర్‌ ప్రారంభించిన మాన్వీ..  ట్రిప్లింగ్‌, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ వంటి వెబ్‌ సిరీస్‌లో నటించారు. హిందీ సినిమాలతోపాటు సీరియల్స్‌లోనూ నటించారు. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌లో పనిచేయానికి నిర్మాత నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఆ సమయంలో నిర్మాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. అతని నుంచి లైంగిక వేధింపులు ఎదర్కొన్నానని పేర్కొన్నారు. ఇక గతంలోనూ మాన్వీ తను ఎదుర్కొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చెప్పిన విషయం తెలిసిందే. ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు అత్యాచార సన్నివేశంలో నటించమని అడిగారని, దాంతో బయపడి అక్కడి నుంచి పరుగులు తీశానని ఆమె తెలిపారు. (ఈ మేలు మర్చిపోము: ట్రంప్‌ ) 

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. వెబ్‌ సిరీస్‌ చేస్తున్నామని, అందులో నన్ను నటించాలని కోరారు. అలాగే నీ బడ్జెట్‌ ఎంత అని నన్ను అడిగారు. దానికి నేను.. ఇప్పుడే బడ్జెట్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ముందు మీరు కథ చెప్పండి. నాకు నచ్చితే అన్నింటి గురించి చర్చిద్దామన్నాను. అయినప్పటికీ నా మాటలు పట్టించుకోకుండా.. లేదు మీకు మేము ఇంత బడ్జెట్‌ను ఇ‍వ్వాలనుకుంటున్నామని చెప్పాడు. అయితే అది చాలా తక్కువ అని చెప్పడంతో అతను వెంటనే దాన్ని మూడు రేట్లు పెంచాడు. అంతేకాకుండా నువ్వు కావాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తా.. కానీ రాజీపడాలని కోరాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇక్కడైతే బతికిపోయేవాడు)

‘ఆ మాటలు విని షాక్‌ అయ్యాను. కాంప్రమైజ్‌ అనే మాట దాదాపు 7, 8 సంవత్సరాల తర్వాత విన్నాను. కోపంతో వెంటనే అతని తిట్టడం ప్రారంభించాను. ఫోన్‌ కట్‌ చేయి.. నీకు ఎంత ధైర్యం.. నీ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదించాను’ అని మాన్వీ చెప్పుకొచ్చారు. కాగా ఓ వైపు మీటు పేరుతో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా.. ఇంకా ఇలాంటివి ఎలా జరుగుతున్నాయో ఆశ్యర్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు.  (వేషం ఉంది.. టాప్‌ తీసెయ్‌ అన్నాడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా