ఇండస్ట్రీ.. ప్లాన్‌ బి!

12 May, 2018 05:05 IST|Sakshi
శ్రద్ధాదాస్‌

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయం, లక్‌ ఉండాలి. కానీ వీటన్నిటి కంటే ముఖ్యంగా కావాల్సింది పట్టుదల అంటున్నారు శ్రద్ధాదాస్‌. హీరోయిన్‌గా రాణించాలనుకుంటున్న వారికి ‘ప్లాన్‌ బి’ కూడా ఉండాలంటున్నారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్ట్‌గా పైకి రావాలంటే ముఖ్యంగా కావాల్సింది పట్టుదల. ఇక్కడ నిలబడాలంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ప్రయత్నించగలగాలి. యాక్చువల్లీ యాక్టర్స్‌ కావాలనుకునేవారిని ‘ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా టఫ్‌గా నిలబడగలగాలి. అలా స్ట్రాంగ్‌గా లేకపోతే వెనక్కి వెళ్లిపోండి’ అని నేనే చాలాసార్లు డిస్కరేజ్‌ చేశాను. అప్పటికీ రావాలనుకునేవాళ్లకు... ‘‘ఇది ‘ప్లాన్‌ బి’గా మాత్రమే పెట్టుకొని రండి.

మీరు చేస్తున్న కార్పొరేట్‌ జాబ్, ఇంకేదైనా కూడా ప్లాన్‌ ‘ఏ’గానే ఉండాలి. అంటే.. ఇండస్ట్రీ అనేది సెకండరీ అనుకోవాలి’ అని చెబుతుంటాను. కొన్నిసార్లు మనం బాగా సూట్‌ అవుతాం అనుకున్న పాత్ర ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన వాళ్లకు వెళ్లిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో జనరల్‌గా జరిగే విషయాల్లో ఇదొకటి. అలాంటి సందర్భాల్లో చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుంది. కానీ ఆ తర్వాత అనిపిస్తుంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినా కూడా ఫస్ట్‌ కొన్ని చాన్స్‌లు రావడం వరకే. ఆ తర్వాత ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్లకి చాన్సులు లభిస్తాయని. ఎప్పటికైనా ‘స్క్రీన్‌ మీద ఎలా ఉన్నాం’ అన్నదే మ్యాటర్‌. బ్యాక్‌గ్రౌండ్‌ ఉందా? లేదా? అన్నది ఆడియన్స్‌కు అనవసరం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు