చైతూకు ఇష్టమైన వెబ్‌ సిరీస్‌ ఏంటో తెలుసా?

24 Jun, 2020 14:35 IST|Sakshi

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య మిగతా సెలబ్రెటీల మాదిరి సోషల్‌ మీడియాలో అంత చురుగ్గా ఉండరన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే తాజాగా ఇన్‌స్టాలో​ చేసిన ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చెర్నోబిల్‌ వెబ్‌ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్న చైతూ స్పూర్థిదాయకంగా ఉన్న ఈ సిరీస్‌ అందరూ చూడాలంటూ సూచించాడు. (అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం)

‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాకు బాగా నచ్చింది ఈ సిరీస్‌. అద్భుత నటన.. రచన, నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతేకాకుండా చాలా స్పూర్థిదాయకంగా ఉంది. మీరు ఇప్పటివరకు చూడకుండా ఉంటే తప్పక చూడండి’ అని పేర్కొంటూ చెర్నోబిల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.  చైతూ సూచించిన సిరీస్‌ను తప్పకుండా చూస్తామని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. 

ఇక మరోవైపు క్రేజీ హీరోయిన్‌ సమంత తన భర్త నాగచైతన్యకు పూర్తి భిన్నంగా ఉంటారు. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటూ పలు పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తుంటారు. గతంలో టెర్రస్‌ గార్డెనింగ్ మొదలు పెట్టిన సమంత తాజాగా ఓ 48 రోజులపాటు ఈషా క్రియ (యోగా) ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఈషా యోగా గురించి సమంత మాట్లాడుతూ.. ‘ఈ క్రియ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆరోగ్యవృద్ధికి తోడ్పడుతుంది. మనిషి శ్రేయస్సుకు అవసరమైన శారరీక బలంతో పాటు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే మానసిక ధైర్యం కూడా వస్తుంది. మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవ్వొచ్చు’ అని సమంత చెప్పారు. (హ్యాపీ గార్డెనింగ్‌)

My lockdown favorites ! Some brilliant performances , writing and production values .. really inspiring to see this content out there .. check it out if you haven’t already ..

A post shared by Chay Akkineni (@chayakkineni) on

Today i begin my 48 days of the Isha kriya journey.. I invite you to join me ... Isha kriya brings health , prosperity and well-being . It is a powerful tool to cope .. and is meant to empower us to live life to our fullest potential .. link in bio .. it is a free guided meditation.. I wish you peace 🤗

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరిన్ని వార్తలు