‘చిరంజీవి సినిమా అయితే ఏంటి?’

22 Aug, 2019 12:32 IST|Sakshi

సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా మంచి ఫాంలో ఉన్న బ్యూటీ నయనతార. వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో విజయాలు సాధిస్తున్న ఈ భామ, సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటారు. తాను లీడ్‌ రోల్‌లో నటించిన సినిమాలను ప్రమోట్‌ చేయడానికి కూడా నయనతార ఇష్టపడరు. అయితే ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరుకు జోడిగా నటించారు.

మెగాస్టార్‌ సినిమా కావటం, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ చిత్రం కావటంతో ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నయనతార పాల్గొంటారన్న టాక్‌ వినిపించింది. కానీ నయన్‌ మాత్రం చిరంజీవి సినిమా అయితే ఏంటి? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిరంజీవితో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ లాంటి నటులు పాల్గొన్నా.. నయనతార మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో నయనతార.. సైరా ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం కూడా అనుమానమే అన్న టాక్‌ వినిపిస్తోంది.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, కన్నడ స్టార్ హీరో సుధీప్, తమిళ సెన్సేషన్‌ విజయ్‌ సేతుపతి, బోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌, టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతి బాబు, మిల్కీ బ్యూటీ తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో విజయ్ సేతుపతి, రామ్‌చరణ్‌, తమన్నా, చిరంజీవి, సుధీప్‌, రవికిషన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

శేష జీవితాన్ని ఇలా గడిపేస్తా: రేణుదేశాయ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

విశాల్‌ స్థానంలో శింబు..!

సినిమా

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

విశాల్‌ స్థానంలో శింబు..!

రామాయ‌ణ్ చూస్తున్నా.. మ‌రి మీరు? 

‘విశ్వాసం’ కాంబో రిపీట్‌