నీ వ్యంగాన్ని అర్థం చేసుకోలేదు: సందీప్‌ కిషన్‌

1 Jul, 2020 13:52 IST|Sakshi

హైదరాబాద్‌: టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్‌‌‌, సందీప్‌ కిషన్‌లు కూడా తమ స్పందనను తెలిపారు. ఈ నేపథ్యంలో నిఖిల్ ట్వీట్‌ చేస్తూ..‌ ‘టిక్‌టాక్‌ను నిషేధించరాదు.. మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించేంత వరకే’ అంటూ స్పందించాడు. అది చూసిన  హీరో సందీప్‌ కిషన్‌ స్పందిస్తూ.. ‘నాది కూడా అదే అభిప్రాయం మామ. కానీ ఇప్పుడు చైనా యాప్‌లను నిషేధించడం అవసరం. చైనా ప్రభుత్వం చేసేది సరైనది కాదు. అయితే మనం కూడా ఉపాధిని కోల్పోతామనుకో.. కానీ ప్రభుత్వ నిర్ణయం ఏంటో కూడా చూడాలి’ అంటూ సమాధానం ఇచ్చాడు. (టిక్‌టాక్ పోయింది..'చింగారి' వ‌చ్చేసింది)

దీనికి నిఖిల్‌.. ‘అవును మామ.. కానీ నా ట్వీట్‌ మళ్లీ చదువు.. అందులోని వ్యంగ్యం అర్థం అవుతుంది’ అంటూ రిట్వీట్‌ చేసి.. చైనా ఉత్పత్తులను నిషేధించాలని పిలుపునిస్తూ #BanChineseProducts అనే హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేయమని కోరాడు. దీనికి ‘సందీప్‌ క్షమించు మామ నీ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు’ అని సమాధానం ఇచ్చాడు. కాగా భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సైబర్‌ ముంపు నుంచి దేశాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం టిక్‌టాక్‌‌, హాలో యాప్‌, యూసీ బ్రౌజర్‌లతో సహా 56 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌)

మరిన్ని వార్తలు