35 ఏళ్ల వయసులో తాత పాత్రలా?

29 Sep, 2014 20:39 IST|Sakshi
35 ఏళ్ల వయసులో తాత పాత్రలా?

ముంబై: ఒక టీవీ నటుడికి ప్రయోగాలు చేసే ఆస్కారం తక్కువగా ఉంటుందన్నాడు బుల్లితెర నటుడు హర్షా చాయా. నేడు టీవీ షోలు అంతంగా ఆకట్టుకోవడం లేదన్నాడు. 'స్వాభిమాన్'టెలివిజన్ షోతో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు తండ్రి పాత్రలు చేయడమంటే బోర్ అంటున్నాడు. అసలు 30 ఏళ్లకే తండ్రి పాత్రలేంటని ప్రశ్నిస్తున్నాడు.  ప్రస్తుతం తాను ఆ తరహా ఆఫర్లకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశాడు.

 

ఇప్పుడు 30 ఏళ్లు దాటితే తండ్రి పాత్రలు.. 35 ఏళ్లు పైబడితే తాత పాత్రలు అంటున్నారు అంటూ బుల్లితెరపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. తాను ఆర్టిస్ట్ గా ప్రధానం ఉన్న పాత్రలనే చేస్తున్నానని తెలిపాడు. త్వరలో 'బాలికా వధు' సీరియల్ లో పెయింటర్ గా దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నాడు. అంతకుముందు ఈ సీరియల్ లో ఓ లవర్ బాయ్ గా పాత్ర చేసానన్నాడు. అయితే పెయింటర్ గా తాను చేసేది చిన్న క్యారెక్టరే అయినా.. అది ప్రాధాన్యత ఉన్న పాత్ర అని పేర్కొన్నాడు.