గోపాలుడా? గోపాల కృష్ణుడా?

12 May, 2017 23:03 IST|Sakshi
గోపాలుడా? గోపాల కృష్ణుడా?

పవన్‌ కల్యాణ్‌ ఇంతకీ గోపాలుడా? గోపాల కృష్ణుడా? అనే చర్చ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు (ఎస్‌. రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే  ‘దేవుడే దిగి వచ్చినా, ఇంజినీరింగ్‌ బాబు, మాధవుడు’ వంటి టైటిల్స్‌ హల్‌చల్‌ చేశాయి. తాజాగా ‘గోపాల కృష్ణుడు, గోపాలుడు’ అనే పేర్లు వినిపిస్తు న్నాయి. పవన్‌ గోపాలుడా? గోపాల కృష్ణుడా? అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఈ టైటిల్స్‌ ఏవీ కాకుండా వేరే టైటిల్‌ని నిర్ణయిస్తారేమో చూడాలి. ఇందులో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు.