ప్రియాంక ఎంగేజ్‌మెంట్‌ ఫోటోస్‌ ఔట్‌

18 Aug, 2018 11:37 IST|Sakshi
ప్రియాంక - నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఫోటో

గత కొంత కాలంగా ప్రియాంక చోప్రా - నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌ గురించి షికారు చేస్తోన్న పుకార్లకు నేటితో తెర పడింది. ఈ రోజు సాయంత్రం ముంబైలోని ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ప్రియాంక తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎంగేజ్‌మెంట్‌ పార్టీ ఇస్తున్నారు.  ఇప్పటికే అమెరికాలో ప్రియాంక - నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌ జరిగిందనే వార్తలు వినిపిస్తోన్న క్రమంలో  మరో సారి హిందూ సాంప్రదాయం ప్రకారం భారత్‌లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ప్రియాంక - నిక్‌ జోనాస్‌లు అధికారికంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

దానిలో భాగంగా ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రియాంక ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం విందు కార్యక్రమం, సాయంత్రం ఎంగేజ్‌మెంట్‌ పార్టీ ఉండనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు హాజరవ్వడం కోసం ఇప్పటికే నిక్‌ జోనాస్‌ తల్లిదండ్రులు ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్విటర్‌ యూజర్ల నుంచి ప్రియాంక-నిక్‌ జోనాస్‌లకు నిశ్చితార్థపు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు