రాధిక ఆప్టేకు క‌రోనా క‌ష్టం..

28 Mar, 2020 08:50 IST|Sakshi

దేశంలో క‌రోనా విసిరిన పంజా విస్త‌రిస్తూనే ఉంది.  ఈ మహమ్మారి రోజురోజుకీ  అధిక‌మ‌తున్న నేప‌థ్యంలో  ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఇప్ప‌టికే దేశంలో 887 కేసులు న‌మోదు కాగా.. 20 మంది మృత్యువాత ప‌డ్డారు. దీని ప్ర‌భావం పెరుగుతుండ‌టంతో అంద‌రూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. కాగా సెల‌బ్రిటీల‌కు క‌రోనా వ‌ల్ల కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. సంచ‌ల‌న న‌టిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టేకు క‌రోనా క‌ష్టం మొద‌లైంది. (కరోనా విరాళం)

Hospital visit! #notforcovid19 #nothingtoworry #alliswell #safeandquarantined 😷

A post shared by Radhika (@radhikaofficial) on

బోల్డ్ మూవీస్‌, స్టేట్‌మెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే ఈ భామ ఇటీవ‌ల‌ ముఖానికి మాస్క్ ధ‌రించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ చేశారు. దీంతో రాధిక‌కు క‌రోనా సోకిందేమోన‌ని అభిమానులు భయానికి గుర‌వుతున్నారు. దీనిపై అనేకమంది అభిమానులు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డంతో తాజాగా లెజెండ్ భామ త‌న పోస్ట్‌పై స్పందించారు. అ ఫోటో కేవలం హ‌స్పిట‌ల్‌కు వెళ్లిన‌ప్పుడు తీసింద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే తాను కోవిడ్ 19 ప‌రిక్ష‌ల కోసం వెళ్ల‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్ప‌టికే పోస్ట్ కాస్తా వైర‌ల్ అవ్వ‌డంతో గల్లీ భాయ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ.. రాధిక ఫోటోపై కామెంట్ చేశారు. ఓ గాడ్‌! జాగ్ర‌త్త ప్రియ‌త‌మా.. దేవుడు నిన్ను ఆశీర్వ‌దిస్తాడు. అంటూ కామెంట్ చేశాడు.కాగా తెలుగు, త‌మిళ్‌, హాలీవుడ్‌, బాలీవుడ్‌లో న‌టించారు. గ‌తంతో ప‌లు సౌత్ సినిమాల్లోని న‌టించిన రాధిక ద‌క్షిణాది హీరోల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్యలు చేసి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. (అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు