వైరల్‌ : పునర్నవితో రాహుల్‌ సందడి

29 Dec, 2019 16:16 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను  ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్‌, పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల  ప్రకాశ్‌రాజ్‌.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్‌, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్‌.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కథలు వండుతున్నారు

దారి చూపే పాట

ఆర్‌ఆర్‌ఆర్‌లో..?

హీరోలకు అండగా ఉందాం

రెహమాన్‌కి కోపమొచ్చింది

సినిమా

కథలు వండుతున్నారు

దారి చూపే పాట

ఆర్‌ఆర్‌ఆర్‌లో..?

హీరోలకు అండగా ఉందాం

రెహమాన్‌కి కోపమొచ్చింది

సొంత హోట‌ల్‌నే ఇచ్చేసిన సోనూసూద్