రవితేజ సినిమా ఆగిపోయిందా..?

18 Jul, 2018 11:35 IST|Sakshi

రాజా ది గ్రేట్‌ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మాస్ మహరాజ్‌ రవితేజ తరువాత ఆ ఫాంను కొనసాగించటంలో ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు ప్లాప్‌ కావటంతో ఈ సీనియర్‌ హీరో ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం రవితేజ, శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్‌ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు. శ్రీనువైట్ల గత చిత్రాలన్ని నిరాశపరచటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలేమి లేవు.

ఈ పరిస్థితుల్లో మరో వార్త మాస్‌ మహరాజ్ అభిమానులకు షాక్‌ ఇస్తోంది. అమర్‌ అక‍్బర్ ఆంటోని తరువాత రవితేజ, సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. విజయ్‌ హీరోగా తమిళ్‌లో సూపర్ హిట్ అయిన తేరి సినిమా తెలుగు రీమేక్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌ను పూర్తిగా పక్కన పెట్టిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు