12 గంటలు 30 కిలోల బరువు

30 Aug, 2018 10:50 IST|Sakshi

12 గంటలు 30 కిలోల బరువు అంటే అర్థం కాలేదు కదూ! అందాలారబోతకే పరిమితం అనే ముద్ర వేసుకున్న నటి క్యాథరిన్‌ ట్రెసా. కార్తీకి జంటగా మెడ్రాస్‌ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఉత్తరాది బ్యూటీ తొలి చిత్రంతోనే హిట్‌ అందుకుంది. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తరువాత చిత్రాల్లో గ్లామర్‌ విషయంలో దుమ్మురేపింది. అలా గ్లామర్‌నటి ముద్రవేసుకున్న క్యాథరిన్‌ ట్రెసా గత చిత్రం కలగలప్పు–2 చిత్రంలోనూ అదే బాణీలో నటించింది.

 తాజాగా సిద్ధార్థ్‌ సరసన నూతన చిత్రంలో నటిస్తోంది. సాయిశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో నటిస్తున్న క్యాథరిన్‌ ట్రెసా గురించి దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రంలో కష్టపడి నటించే కథానాయకి అవసరం అయ్యిందన్నారు. అలాంటి నటి కోసం పరిశీలిస్తుండగా నటి క్యాథరిన్‌ ట్రెసా అయితే బాగుంటుందని భావించినట్లు తెలిపారు. వెంటనే ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో కథానాయకి పాత్ర సాధారణంగా ఉందని, పలు సన్నివేశాల్లో శ్రమించి నటించాల్సి ఉంటుందని అన్నారు. 

అయితే తాము భావించించినట్లుగానే క్యాథరిన్‌ ట్రెసా వాననకా, ఎండనకా కష్టం అని భావించకుండా చాలా బాగా నటించిందని తెలిపారు. చిత్రంలో ఒక సన్నివేశంలో విలన్‌ హీరోయిన్‌ తలపట్టుకుని జరజరా ఈడ్చుకుంటూ వచ్చే సన్నివేశం చోటుచేసుకుంటుందన్నారు. మరో సన్నివేశం కోసం 30కిలోల బరువును మోస్తూ నటించాల్సి ఉంటుందని, ఆ సన్నివేశం కోసం క్యాథరిన్‌ ట్రెసా 12 గంటల పాటు 30 కిలోల బరువును మోస్తూ నటించిందని దర్శకుడు తెలిపారు. మొత్తం మీద చాలా కాలం తరువాత క్యాథరిన్‌ ట్రెసాను ఒక ముఖ్యమైన పాత్రలో చూడబోతున్నామన్న మాట. ఈ చిత్రంతో అమ్మడి గ్లామరస్‌ నటి అనే ముద్ర పోతుందేమో చూద్దాం.

మరిన్ని వార్తలు