నవ్వించి ఏడిపిస్తాం

24 Sep, 2019 00:55 IST|Sakshi

‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్‌ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత  శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి. ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ సుడిగాలి సుధీర్, గెటప్‌ శ్రీను, రామ్‌ప్రసాద్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్‌’. కారుణ్య చౌదరి కథానాయిక.  ఓరుగుల్లు సినీ క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌కుమార్‌ జి. దర్శకత్వంలో నగేశ్‌ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్‌ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్‌ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్‌ చూస్తాను.

‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్‌ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్‌ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్‌ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్‌. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’   అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్‌ శ్రీను, రామ్‌ప్రసాద్‌ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్‌ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్‌ కుమార్‌. ‘‘స్క్రిప్ట్‌ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా