-

‘కునుకు తీసినంత సులువుగా ప్లాస్మా దానం’

2 May, 2020 11:19 IST|Sakshi

కాలిఫోర్నియా : కరోనాపై విజయం సాధించిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ హాంక్స్‌(63) ప్లాస్మా దానం చేశారు. గత వారం టామ్‌ హాంక్స్‌ ఇచ్చిన ప్లాస్మా బ్యాగు ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. శరీరం నుంచి ప్లాస్మాను తీయడం కునుకు తీసినంత సులువుగా అనిపించిందని పేర్కొన్నారు. 

కాగా హాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌  టామ్‌ హాంక్స్‌, రీటా విల్సన్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న వీరు ప్రస్తుతం అమెరికాకు చేరుకున్నారు. సేవింగ్‌ ప్రైవేట్‌రియాన్‌, కాస్ట్‌ అవే, ఫిలడెల్పియా, ఫారెస్ట్‌ గంప్‌, స్ప్లాష్‌, బ్యాచిలర్‌ పార్టీ, బిగ్‌, ది టెర్మిమినల్‌, అపో వంటి చిత్రాలతో మంచి నటుడిగా టామ్‌ హాంక్స్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి భార్య సమంతా లూయీస్‌ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు.

చదవండి : 2293 కొత్త కేసులు, 71మంది మృతి

మరిన్ని వార్తలు