‘వీర భోగ వసంత రాయలు’ మూవీ రివ్యూ

26 Oct, 2018 11:10 IST|Sakshi

టైటిల్ : వీర భోగ వసంత రాయలు
జానర్ : క్రైమ్‌ థ్రిల్లర్‌
తారాగణం : సుధీర్‌ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ
సంగీతం : మార్క్‌ కె రాబిన్‌
దర్శకత్వం : ఆర్‌ ఇంద్రసేన
నిర్మాత : అప్పారావు

నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రీ విష్ణు.. ఈ ముగ్గురు డిఫరెంట్ ఇమేజ్‌ ఉన్న తెలుగు హీరోలు. విభిన్న కథలను ఎంచుకునే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానుల అంచనాల మరింత భారీగా ఉంటాయి. వీర భోగ వసంత రాయలు విషయంలో అదే జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్‌లు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్‌లతో మంచి హైప్‌ క్రియేట్‌ చేసిన వీర భోగ వసంత రాయలు తరువాత తరువాత ఆ స్థాయిలో సందడి చేయలేదు. దీంతో రిలీజ్‌ సమయానికి సినిమా మీద అంచనాలు పడిపోయాయి. మరి ఇలాంటి సమయంలో రిలీజ్‌ అయి వీర భోగ వసంత రాయలు ఏమేరకు ఆకట్టుకుంది..?

కథ ;
సినిమా ప్రధానంగా మూడు నేరాలకు సంబంధించిన కథగా సాగుతుంది. క్రికెటర్స్‌ తో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తాయి. ఇక మూడో కేసులో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. ప్రధానమైన విమాన హైజాక్ కేసును దీపక్‌ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు అప్పగిస్తారు. మిస్ అయిన ఇంటి కేసును వినయ్‌ (సుధీర్‌ బాబు) టేకప్‌ చేస్తాడు. ఫ్లైట్‌ హైజాక్‌ చేసిన వ్యక్తి 300 మంది బంధీలను విడుదల చేసేందుకు అంతే సంఖ్యలో నేరస్తులను చంపేయాలని డిమాండ్‌ చేస్తాడు. అసలు విమానం హైజాక్‌ చేసింది ఎవరు..? మిగిలిన రెండు కేసులతో ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి..? హైజాకర్‌ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ప్రమోషన్‌లో శ్రీవిష్ణు పాత్రను హైలెట్‌ చేసినా సినిమాలో ఎక్కువ సేపు తెర మీద కనిపించింది మాత్రం సుధీర్‌ బాబు ఒక్కడే. అయితే సుధీర్‌ బాబుకు మరొకరితో డబ్బింగ్‌ చెప్పించటం వర్క్‌ అవుట్ కాలేదు. సుధీర్‌ నటన పరంగా ఆకట్టుకున్నా వాయిస్‌ తనది కాకపోవటంతో ఆడియన్స్‌ కనెక్ట్‌ కావటం కష్టమే. నారా రోహిత్, శ్రియలకు తెర మీద కనిపించింది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్‌ చేసుకునే అవకాశం దక్కలేదు. ఇక కీలకమైన పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయి పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు విలన్‌ లుక్‌లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్‌ డెలివరీ కూడా నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవటంతో ఉన్నంతలో తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ ;
సినిమాను ఇంట్రస్టింగ్‌ పాయింట్‌తో స్టార్ట్‌ చేసిన దర్శకుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించటంలో తడబడ్డాడు. మూడు భిన్నమైన కేసుల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ఆ కథను అనుకున్నట్టుగా తెర మీద చూపించటంలో ఫెయిల్‌ అయ్యాడు. చాలా సన్నివేశాలు లాజిక్‌ లేకుండా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నా అవి సినిమాను ఏమేరకు కాపాడతాయో చూడాలి. ముఖ్యంగా సినిమాకు నిర్మాణ విలువలే ప్రధాన సమస్యగా మారాయి. క్వాలిటీ పరంగా సినిమా నిరాశపరుస్తుంది. కథా కథనాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో వీర భోగ వసంత రాయలు ఆడియన్స్‌ సహనానికి పరీక్షగా మారింది. సినిమాటోగ్రఫి, సంగీతం పరవలేదనిపిస్తాయి. 

ప్లస్‌ పాయింట్స్‌ ;
లీడ్‌ యాక్టర్స్‌ నటన
కథ

మైనస్‌ పాయింట్స్‌ ;
నిర్మాణ విలువలు
స్లో నేరేషన్‌
ఆసక్తికరంగా లేని సన్నివేశాలు

Poll
Loading...
మరిన్ని వార్తలు