సినిమాకి సినిమా కష్టాలు వచ్చాయి

23 May, 2020 00:31 IST|Sakshi
వైవీఎస్‌ చౌదరి

‘‘సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టమొస్తే ‘సినిమా కష్టాలొచ్చాయి’ అంటారు. ప్రసుత్తం కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి’’  అన్నారు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైవీఎస్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాకు కష్టాలు రావడం కొత్తేం కాదు. కేబుల్‌ టీవీ, సీడీ, డీవీడీ ప్లేయర్స్, సీరియల్స్, గేమ్‌ షోస్, క్రికెట్, ఐపీఎల్, యూట్యూబ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌.

వీటన్నింటినీ తట్టుకొని సినిమా థియేటర్‌లో నిలబడుతూనే ఉంది. నిశ్చింతగా, నిశ్చలంగా ఉండటం సినిమాకి చేతకాదు. సముద్రపు అలలాగా పడినా పైకి లేవడం సినిమాకి తెలుసు. కోవిడ్‌ కాదు దానికంటే ప్రమాదకరమైనది వచ్చినా థియేటర్‌లో సినిమా చూడాలనే ప్రేక్షకుడి కాంక్షను ఆపలేదు. థియేటర్‌లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు. కోవిడ్‌ వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తున్న థియేటర్లు త్వరలోనే జన సమూహాలతో ప్రకాశవంతం చెందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు