24 గంటల్లో.. 28వేలకు పైగా కేసులు

12 Jul, 2020 10:10 IST|Sakshi

ఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు సంఖ్య 8,49,553గా ఉంది. కాగా కరోనాతో కొత్తగా 551 మరణించడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 22,674కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,34,621గా ఉంది. దేశంలో ప్రస్తుతం 2,92,258 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోనే మ‌హారాష్ర్ట‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోదు అయ్యాయి. మ‌హారాష్ర్ట‌లో 2,46,600 పాజిటివ్ కేసులు(మర‌ణాలు 10,116), త‌మిళ‌నాడులో 1,34,226(మ‌ర‌ణాలు 1,898), ఢిల్లీలో 1,10,921 పాజిటివ్ కేసులు(మ‌ర‌ణాలు 3,334) న‌మోదు అయ్యాయి. కాగా దేశంలో కరోనా రికవరీ రేటు 72 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు