యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్‌

10 May, 2020 05:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్‌ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్‌ సర్వీలెన్స్‌ కలిగిన యాప్‌ అని తెలిపారు.

ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్‌ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్‌ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్‌ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు