వలస కార్మికులతో క్రైమ్‌ పెరుగుదల!

5 Jun, 2020 18:53 IST|Sakshi

బిహార్‌ పోలీస్‌శాఖ వివాదాస్పద లేఖ

పట్నా : లాక్‌డౌన్‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నిస్తున్న తరుణంలో బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన ఓ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) అమిత్‌ కుమార్‌ జిల్లా ఎస్పీలకు మూడు రోజుల క్రితం ఓ లేఖ రాశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలోనే ఉపాధి లేక స్వరాష్ట్రానికి (బిహార్‌) తిరిగివచ్చిన వలస కూలీలు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కూలీల రాకతో రాష్ట్రంలో మరోసారి క్రైమ్‌ రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఏడీజీ వివాదాస్పద రీతిలో లేఖ రాశారు. అంతేకాకుండా అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్న కూలీల వివరాలను నమోదు చేసుకోవాలని స్థానిక ఎస్పీలందరికీ ఆయన సూచించారు. (వారానికి ఒక్కసారైనా... లేదంటే జీతం కట్!)

ఏడీజీ రాసిన లేఖలో ‘ఇనాళ్లూ దేశంలో ఎక్కడ ఒక చోటు ఏదో ఒక పని చేసుకుంటూ వలస జీవులు కాలం వెళ్లదీశారు. కూలీలపై పిడుగులా పడిన కరోనా వైరస్‌ వారిని నేరాలకు పాల్పడేలా చేసే అవకాశం ఉంది. ఉపాధి లేక కుటుంబ గడవక దోపిడీలు, దొంగతనాలకు పాల్పడొచ్చు. రాష్ట్రంలోని వచ్చిన వలస కార్మికుల రాకలను స్థానిక పోలీసు అధికారులు గమనించాలి.’ అని పేర్కొన్నారు. తాజా లేఖపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను దొంగలతో పోల్చడం సరైనది కాదని, దీనికి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విపక్షాల నుంచి విమర్శలు ఎక్కువతున్న తరుణంలో తన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏడీజీ కుమార్‌ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.


 

>
మరిన్ని వార్తలు