రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!

12 May, 2020 08:33 IST|Sakshi

రోగులు, దివ్యాంగులు, విద్యార్థులకు మాత్రమే రాయితీ

సాక్షి, న్యూఢిల్లీ: క‌రోనా వైరస్,  లాక్‌డౌన్  కారణంగా ‌ నిలిచిపోయిన  రైళ్లు ఈ రోజు (మంగ‌ళ‌వారం) నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. 15 రూట్ల‌లో ప్రత్యేక రైళ్లను న‌డిపేందుకు రైల్వే శాఖ‌ సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో  రాయితీలకు సంబంధించి రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ  తాజాగా  విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటనిచ్చింది.

కొంతమంది రోగులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే రాయితీ ధరల్లో టికెట్లు అందుబాటులో వుంటాయని  రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ)

అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రిత్వ శాఖ  వివరణ ఇచ్చింది. విద్యార్థులు, 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల  రోగులకు మాత్రమే రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని  రైల్వే శాఖ  ప్రజలకు సూచించింది.  కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0 కొనసాగుతుండగా,  దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. (రైలు బండి.. షరతులు ఇవేనండీ)

మరిన్ని వార్తలు