కరోనా హగ్‌ టైం : వైరల్‌ వీడియో

19 May, 2020 20:47 IST|Sakshi

సాక్షి, ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర మరోసారి ఆసక్తికరమైన​ విషయాన్ని ట్విటర్‌ లో షేర్‌చేశారు.  కరోనా  వైరస్‌ కోరల్లో చిక్కి ప్రపంచమంతా  ఇంకా అల్లాడుతూనే  ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొన్ని సడలింపులు, ఊరటలు లభించినప్పటికీ, మనుషులంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ..కనీస సామాజిక సంబంధాలకు దూరంగా బతకాల్సిన పరిస్థితి.

ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో  పెద్ద వాళ్ల ఆలింగనాలకు, ఆప్యాయతకు చిన్నారులు, చిన్నారులు, సన్నిహితులు  స్పర్శకు పెద్దవాళ్లు నోచుకోలేకపోతున్నారు.  అయితే ఇలాంటి అనుభవాన్ని మిస్‌ కాకుండా  కనిపెట్టిన ఒక విలక్షణమైన పరికరానికి సంబంధించిన ఒక వీడియోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!)

ఈ పరికరాన్ని సృష్టించడానికి నోబెల్ బహుమతి విజేత కానవసరంలేదు.. కానీ ఆప్తుల ఆలింగనాన్ని కోల్పోయిన వృద్ధుల జీవితాలను ఈ ఆవిష్కరణ మార్చేసింది.... మనం ఎంతో  ఎదురు  చూస్తున్న  వైరస్‌ టీకా  అంత ముఖ్యమైనది ఇది కూడా అని  ఆయన ట్వీట్‌  చేశారు. (కరోనా: వారికి ఎం అండ్‌ ఎం బంపర్‌ ఆఫర్లు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు