‘మనదేశంలో మరణాల రేటు 2.72 శాతమే’

10 Jul, 2020 15:44 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. అదే సమయంలో మరణాల రేటు 2.72 శాతం మాత్రమే ఉందని అన్నారు. భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి  క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ) ద‌శ‌కు చేరుకోలేద‌ని ఆయన మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. కొన్ని చోట్ల మాత్రం స్థానికంగా కోవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. రోజూ 2.7 లక్షల పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, కేసుల పెరుగుదల గురించి ఆందోళన చెందడం లేదని చెప్పారు. వైరస్‌ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
(చదవండి: పనికిరాని ప్లాస్టిక్​తో లక్ష కి.మీ రోడ్లు)

కాగా, దేశవ్యాప్తంగా శుక్రవారం అత్యధికంగా 26,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,802 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 475 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21,604కు చేరుకుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,95,513కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. ఇక రాష్ట్రాలవారీగా కోవిడ్‌ కేసులు చూస్తే.. 2,30,599 కేసులతో మహారాష్ట్ర, 1,26,581 కేసులతో తమిళనాడు, 1,07,051 కేసులతో ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి
(క‌రోనా : దేశంలో సామాజిక వ్యాప్తి ద‌శ‌కు చేరుకోలేదు)

>
మరిన్ని వార్తలు