భారత్‌: మరోసారి రికార్డు స్థాయిలో కేసులు

20 Jun, 2020 10:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. వరుసగా తొమ్మిదో రోజు కూడా పదివేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.  375 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసులు 3,95,048కు, మృతుల సంఖ్య 12,948కు చేరుకుంది. తాజా పిరిస్థితులను అంచనా వేస్తే మరికొన్ని గంటల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరనుంది.  దేశంలో తొలి కరోనా కేసు నమోదనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది)

ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 వేలకు మందికి పైగా ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,13,831 మంది పూర్తిగా కోలుకోగా, 1,68,269 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌ ఉంది.  (భారతీయులకు కృతజ్ఞతలు)

మరిన్ని వార్తలు