బెడ్‌షీటుతో పారిపోయేందుకు ప్ర‌య‌త్నించి

6 Apr, 2020 21:16 IST|Sakshi

చండీగఢ్: ఓ క‌రోనా అనుమానితుడు ఆసుప‌త్రి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలో ఆసుప‌త్రి ఆరో అంత‌స్థు నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించే క్ర‌మంలో కింద‌ప‌డి మ‌ర‌ణించిన‌ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. పానిప‌ట్‌కు చెందిన 50 ఐదేళ్ల వ్య‌క్తి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. చికిత్స నిమిత్తం ఏప్రిల్ 1న పంజాబ్‌లోని క‌ర్న‌ల్‌లో క‌ల్ప‌నా చావ్లా ఆసుప‌త్రికి వెళ్లాడు. అక్క‌డి వైద్యులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకుగానూ అత‌డిని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. కానీ హ‌ఠాత్తుగా సోమ‌వారం ఉద‌యం నాలుగు గంట‌ల ప్రాంతంలో అత‌డు బెడ్‌షీట్లు, ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను తాడుగా మ‌లిచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. (వారం పాటు మాస్క్‌లపై కరోనా వైరస్‌)

బెడ్‌షీట్ల స‌హాయంతో ఆరో అంత‌స్థులోని కిటికీ గుండా కింద‌కు దిగుతుండ‌గా ఒక్క‌సారిగా కింద‌ప‌డి చ‌నిపోయాడు. కాగా అత‌నికి క‌రోనా ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ఐసోలేషన్ వార్డులో చేర్చిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. అత‌ని ద‌గ్గ‌ర నుంచి సాంపిల్స్ సేక‌రించి ల్యాబ్‌కు పంపామ‌ని ఫ‌లితాలు రావాల్సి ఉంద‌ని తెలిపారు. మ‌రోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్ జై ప్ర‌కాశ్ నారాయ‌ణ్ అపెక్స్ ట్రామా సెంట‌ర్‌లోక‌రోనా ల‌క్ష‌ణాల‌తో చేరిన రోగి ఆత్మ‌హత్య‌కు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో అత‌ని కాలు ఫ్రాక్చ‌ర్ అవ‌గా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. (కరోనా భయంతో ఆస్పత్రిపై నుంచి దూకాడు..)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు