విధుల్లో చేరని వైద్యులపై వేటు

7 May, 2020 17:05 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ : పబ్లిక్‌ సర్వీస్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా ఎంపికై ఇప్పటివరకూ విధుల్లో చేరని 400 మందికి పైగా వైద్యులను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సర్వీసుల నుంచి తొలగించింది. ఈ వైద్యులు విధుల్లో చేరడం గానీ, ప్రొబేషన్‌ సమయాన్ని పూర్తిచేయడం గానీ చేయనందున వీరందరి సర్వీసును రద్దు చేస్తూ వీరి స్ధానంలో నూతన వైద్యుల నియామకం చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 467 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలెక్షన్‌ కమిషన్‌కు నివేదించింది. ఈ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని కమిషన్‌ను కోరామని సింగ్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 145 మంది వైద్యులను తమ పోస్టుల్లో చేరాలని హెచ్చరించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం 2000 మందికి పైగా వైద్యులు, 1500 మంది పారామెడికల్‌ సిబ్బంది కరోనా మహమ్మారితో ముందుండి పోరాడుతున్నారు. ​కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వైద్య విద్యార్ధులు తక్షణమే తమ ఇంటర్న్‌షషిప్‌ ప్రారంభించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య మానవ వనరులను సన్నద్ధం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి రెండో వారంలో 200 మందికి పైగా వైద్యులను నియమించింది. చదవండి : కోవిడ్‌ యోధులకు సెల్యూట్‌

మరిన్ని వార్తలు